Header Banner

టీటీడీ లేటెస్ట్ అప్ డేట్! మే ఒకటి నుండి కొత్త రూల్స్ అమలు! ఇక వాటికి బ్రేక్!

  Wed Apr 30, 2025 14:47        Devotional

తిరుమలలో సాధారణ భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ వేళ కొత్త నిర్ణయాల అమలుకు సిద్దమైంది. రేపు (మే 1) నుంచి తిరుమలలో బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పులు జరుగుతున్నాయి. బ్రేక్ దర్శనాల మార్పును ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు టీటీడీ సిద్దమైంది. ఇక.. సిఫారసు లేఖల పైన దర్శనాల విషయంలోనూ టీటీడీ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం తిరుమలలో రద్దీ తగ్గింది. భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇక, టీటీడీ భక్తులకు సైతం కొన్ని సూచనలు చేసింది.

 

నేరుగా శ్రీవారి దర్శనం
సిఫారసు లేఖల రద్దు వేసవి సెలవుల్లో భారీగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంది. మే 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తోంది. అదే విధంగా మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలు అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని టీటీడీ స్పష్టం చేసింది. ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని టీటీడీ వెల్లడించింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్య త కల్పించేందుకు సిఫార్సు లేఖలు రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. అదే విధంగా బ్రేక్ దర్శనాల సమయంలో మార్పుల ను ప్రయోగాత్మాకంగా అమలుకు నిర్ణయించింది.

 

ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం..! భార్య, కుమారుడిని చంపి టెక్కీ ఆత్మహత్య!

 

బ్రేక్ వేళల మార్పు
బ్రేక్ వేళల మార్పు తిరుమలలో మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో టీటీడీ మార్పులు చేసింది. మే 1 నుంచి ఉదయం 6 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పిస్తామని వెల్ల డించింది. మే 1 నుంచి జులై 15వ వరకు ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు టీటీడీ అధికా రులు స్పష్టం చేసారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకు న్నట్లు వెల్లడించింది. ఈ వేళల మార్పు ద్వారా ఎక్కువ సమయం క్యూ లైన్లలో ఉంటున్నా సాధా రణ భక్తులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న కొత్త వేళల ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుందో గమనించి.. కొనసాగింపు పైన నిర్ణయించనున్నారు.

 

భక్తులకు అలర్ట్
ప్రస్తుతం తిరుమలలో రద్దీ తగ్గింది. వారాంతంలో మాత్రం భారీగా ఉంటోంది. ఈ రోజు భక్తులు శ్రీవారిని నేరుగా దర్శించుకుంటున్నారు. ఇక, టీటీడీ సైతం వేసవి రద్దీ వేళ.. భక్తులు టోకెన్ల పైన తమకు కేటాయించిన సమయానికే క్యూ లైన్లలోకి చేరుకోవాలని సూచిస్తోంది. ఇటు...మరోవైపు తిరు మలలో పోలీసుల హైఅలర్ట్ కొనసాగుతోంది. బస్టాండ్లు, హోటళ్లు, మఠాల వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేస్తోంది. ఇక, జూన్ 15వ తేదీ వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్న టీటీడీ అధికారులు.. సిఫారసు లేఖలను మాత్రం జూలై 15 వరకు అనుమించమని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే సిఫారసు లేఖలతో తిరుమల ప్రయాణం ఖరారు చేసుకున్న ప్రయాణీకులు తాజా నిర్ణయాలతో మార్పులు చేసుకోవాల్సి వస్తోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #tirumala #ttddecisions #breakdarshan #vipdarshan #ttdupdate #devoteesfirst #tirumalanews